News April 21, 2024
బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News April 18, 2026
కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.
News April 18, 2026
అందుకే మ్యాచ్‌లకు రావట్లేదన్న డింపుల్ బ్యూటీ

PBKS యజమాని ప్రీతి జింటా గత సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి తన జట్టుకు సపోర్ట్ చేసేవారు. అయితే ఈ సీజన్‌లో జట్టు విజయాలతో దూసుకెళ్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో SM వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీంతో ఆమె రిప్లై ఇచ్చారు. ‘చాలా కాలంగా పిల్లలకు దూరంగా ఉన్నా. ప్రస్తుతం వాళ్లకు సెలవులు. వారితో గడపడానికే మ్యాచ్‌లకు రావట్లేదు. త్వరలోనే స్టేడియంలో కనిపిస్తా’ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News April 18, 2026
OTTలోకి కొత్త సినిమాలు

⋆ ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి నటించిన ‘బ్యాండ్ మేళం’ ఈ నెల 24 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
⋆ ప్రియదర్శి, సాయికుమార్ ‘సుయోధన’ తాజాగా JioHotstar, ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
⋆ రాశీఖన్నా ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ మే 8 నుంచి ప్రైమ్ వీడియోలోకి రానుంది.
⋆ పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళ హిట్ మూవీ ‘యూత్’ Netflixలో, రాధిక నటించిన ‘తాయి కిళవి’ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.


