News December 20, 2025
నిర్మల్ జిల్లాలో రూ.14,67,700 సీజ్: ఎస్పీ

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని 12 చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.14,67,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదుతో పాటు రూ.7లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన 150 కేసుల్లో 201 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
ISS నుంచి స్టార్ట్ అయిన వ్యోమగాములు

ISS నుంచి నలుగురు వ్యోమగాములు ముందుగానే భూమికి తిరిగొస్తున్న <<18804760>>విషయం<<>> తెలిసిందే. ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:50కి స్టార్ట్ అయ్యారు. స్పేస్-X డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు అమెరికన్, ఒక జపాన్, ఒక రష్యన్ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. 2:OO PMకి కాలిఫోర్నియాలోని పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ కానున్నారు.
News January 15, 2026
కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.
News January 15, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.


