News December 20, 2025

10ఏళ్ల కిందటే మైనింగ్‌కు ప్రయత్నం.. అడ్డుకున్న ప్రజలు

image

తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ, సాదుకొండ, ఇనుము కొండల్లో మైనింగ్ ప్రయత్నాలు 10ఏళ్ల కిందటే మొదలయ్యాయి. అప్పట్లో నియోజకవర్గంలోని 6మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలు చేపట్టారు. పార్టీలకతీతంగా నాయకులు, నేతలు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. అధికారులు సహకరించడంతో ప్రజలు, నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తడంతో అప్పట్లో మైనింగ్ విరమించుకున్నారు.

Similar News

News February 15, 2026

దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

image

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.

News February 15, 2026

కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదు: పొన్నం

image

నిజామాబాద్ లాగానే కరీంనగర్ కార్పొరేషన్ లోనూ బీజేపీకి మెజారిటీ లభించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ.. కరీంనగర్ లో మేమే గెలిచామని ప్రకటించిన బండి సంజయ్ 66+ఎంపీ+ లోకల్ ఎమ్మెల్యే + మానకొండూరు ఎమ్మెల్యే కలిసి మొత్తం 69 స్థానాలు ఉండగా బీజేపీకి 30 మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీ లాగానే అన్ని పార్టీలకు వ్యూహాలు ఉంటాయని ఆయన తెలుసుకోవాలన్నారు.

News February 15, 2026

‘రాజన్న ఆలయ సీసీ ఫుటేజీ వెంటనే బహిర్గతం చేయాలి’

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సీసీ ఫుటేజిని వెంటనే బహిర్గతం చేయాలని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేలాదిమంది భక్తులు భీమేశ్వర స్వామిని దర్శించుకుండగా, ఓ ప్రైవేటు వ్యక్తి ఆలయ సిబ్బంది సహకారంతో రాజన్నను దర్శించుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.