News December 20, 2025
SHAR: 24న ఉదయం 8.54 గంటలకు..

AP: మరో శాటిలైట్ ప్రయోగానికి SDSC SHAR సిద్ధమైంది. ఈనెల 24న 8.54amకు LVM3-M6 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. USకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్–6ను నింగిలోకి పంపనున్నారు. ఈ నెల 15న, 21న ప్రయోగం చేయాలనుకున్నా సాంకేతిక కారణాలతో కుదరలేదు. అటు ఈ ప్రయోగాన్ని SHAR గ్యాలరీల నుంచి చూడాలనుకునే వారు <
Similar News
News January 20, 2026
చలికాలం.. పంటలో పురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.
News January 20, 2026
నేడు దావోస్‌లో CM చంద్రబాబు కీలక భేటీలు

రెండోరోజు దావోస్‌లో CM చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. CII బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై మాట్లాడతారు. అనంతరం ఇండియా లాంజ్ ప్రారంభ కార్యక్రమంలో ఇన్వెస్టర్స్‌తో సమావేశమవుతారు. తర్వాత IBM CEO అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ CEO థామస్‌ను కలుస్తారు. ఈవినింగ్ JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, JSW సిమెంట్స్, పెయింట్స్ సంస్థల MD పార్థ్ జిందాల్‌తో కూడా సమావేశమవుతారు.
News January 20, 2026
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


