News December 20, 2025
సిద్దిపేట: ట్రాన్సజెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధి పునరావాస పథకం కింద ట్రాన్స్ జెండర్‌లకు బుుణాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ అధికారి శారద తెలిపారు. జిల్లాకు మొత్తం 5 యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్‌ల కోసం ఈ పథకం కింద రూ.75 వేల పూర్తి సబ్సీడితో రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. www.wdsc.telangana.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 24, 2026
టీ20: హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

విశాఖపట్నంలో ఈ నెల 28న జరగనున్న భారత్–న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్‌కు టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ప్రత్యక్షంగా 27,251 మంది వీక్షించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. తొలి దశలో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా 18 స్టాండ్లు, కార్పొరేట్ బాక్స్‌ల టికెట్లు అమ్మకానికి పెట్టారు. గంటల్లోనే రూ.1200, రూ.2500, రూ.3000 టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. అధిక ధర టికెట్లు మాత్రం నెమ్మదిగా విక్రయమవుతున్నాయి.
News January 24, 2026
HYD: డేటింగ్‌కు పిలుస్తారు.. ఉన్నదంతా ఊడ్చేస్తారు..!

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాటినా అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల MDMA వంటి మత్తుపదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. మరోవైపు, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన యువతులు బాధితులను పబ్‌లకు పిలిపించి, భారీగా బిల్లులు వేయించి పరారవుతున్నట్లు మోసాలు వెలుగు చూస్తున్నాయి.
News January 24, 2026
‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.


