News April 21, 2024
మాల్దీవుల్లో ఎలక్షన్స్.. అధికార పక్షానికి అగ్నిపరీక్ష!

మాల్దీవుల్లో 93 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 పార్టీల నుంచి 368 మంది పోటీలో ఉన్నారు. ఫలితాలు రేపు రానుండగా, ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్’కు షాక్ తగిలే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముయిజ్జు చేపట్టిన భారత వ్యతిరేక చర్యల నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ రావొచ్చని అంటున్నారు.
Similar News
News February 1, 2026
ప.గో: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. పార్శిల్ ఓపెన్ చేయగానే కస్టమర్ షాక్!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో భద్రత ప్రశ్నార్థకమవుతోంది. భీమవరం జంక్షన్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన వాణి అనే మహిళ ఓ డెలివరీ సైట్‌లో టిఫిన్ ఆర్డర్ చేయగా.. పార్శిల్‌లో ఆహారంతో పాటు కరెంట్ ప్లగ్ రావడంతో ఆమె నివ్వెరపోయారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లలో నాణ్యత, పర్యవేక్షణ లోపంపై జనం మండిపడుతున్నారు.
News February 1, 2026
ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్‌కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.
News February 1, 2026
పాక్‌లో దాడులు.. 125 మంది మృతి

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.


