News December 20, 2025
సీసీఎంబీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని CCMB 9 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, MSc (నేచురల్ సైన్స్), BE, B.Tech, PhD (బయోఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్, జీనోమిక్స్, మైక్రో బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in
Similar News
News December 30, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 30, 2025
పసిడి సామ్రాజ్యం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్స్!

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఒక గొప్ప సెంటిమెంట్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న 34,600 టన్నుల బంగారం విలువ $5 ట్రిలియన్లకు (₹420 లక్షల కోట్లు) చేరిందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విశేషమేమిటంటే ఈ సంపద మన దేశ మొత్తం GDP ($4.1 ట్రిలియన్లు) కంటే కూడా ఎక్కువ. ఈ భారీ ‘గోల్డ్ పవర్’ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే హాట్ టాపిక్‌గా మారింది.
News December 30, 2025
యువీ కోచ్ అయితే.. పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ ఉంటే బాగుంటుందంటూ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టులు, ODIలకు అతను సరైన ఎంపికని పేర్కొన్నారు. ఇప్పటికే శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ కెరటాలను తీర్చిదిద్దిన అనుభవం యువీకి ఉందని గుర్తుచేశారు. కోచింగ్ సిబ్బందిలో మార్పులపై చర్చ జరుగుతున్న వేళ పనేసర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.


