News December 20, 2025
కృష్ణమ్మ ఒడిలో లగ్జరీ హౌస్ బోట్లు

పర్యాటక రంగానికి కొత్త కళ తెచ్చేలా కృష్ణా నదిలో లగ్జరీ హౌస్ బోట్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు 20 కి.మీ మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. ఏసీ, అత్యాధునిక బెడ్రూమ్‌లు, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలతో పర్యాటకులకు కేరళ అనుభూతిని అందించనున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.
Similar News
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.
News January 16, 2026
భూపాలపల్లి: మైనారిటీ గురుకులంలో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

భూపాలపల్లి మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు.5వ తరగతి,ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6,7,8వతరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఉత్తమ బోధనతోపాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలొ ప్రిన్సిపల్ రవి తదితరులు పాల్గొన్నారు.
News January 16, 2026
ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.


