News December 20, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 142 సొసైటీలు

తెలంగాణ వ్యాప్తంగా కో ఆపరేటివ్ బ్యాంకులు <<18617893>>సొసైటీల పాలకవర్గాలు రద్దు<<>> కావడంతో గ్రామాల్లో నాయకులు, రైతు ప్రతినిధులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. సర్పంచ్‌గా ఓడిన వారు పోటీ చేయని సీనియర్ నేతలు అప్పుడే రంగంలోకి దిగి లాబీయింగ్ ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ పాలకవర్గం నామినేట్ కానుంది. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొత్తం 142 సొసైటీలకు కొత్త అధ్యక్షులు రానున్నారు.
Similar News
News January 23, 2026
తులసిమతి మురుగేషన్‌కు మూడు బంగారు పతకాలు

కైరోలో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ప్లేయర్ తులసిమతి మూడు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.
News January 23, 2026
కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా?

దిష్టి తగలకూడదని కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. అయితే మంగళవారం లేదా శనివారం రోజున దాన్ని ధరించడం శుభకరమంటున్నారు పండితులు. పురుషులు కుడి కాలికి, స్త్రీలు ఎడమ కాలికి దీనిని కట్టుకోవాలని సూచిస్తున్నారు. ‘దారానికి తొమ్మిది ముడులు వేయడం ముఖ్యం. నలుపు రంగు ఉన్న చోట వేరే ఇతర రంగు దారాలు ఉండకూడదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది’ అని చెబుతున్నారు.
News January 23, 2026
కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.


