News December 20, 2025
లింగ మిరియాల కలుపు మొక్కలను ఎలా నియంత్రించాలి?

‘లింగ మిర్యాల’ కలుపు మొక్కలు రబీలో ఉష్ణోగ్రతలు తగ్గాక, అపరాల కోత అనంతరం భూమిలో తేమను పీల్చుకొని పెరిగి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇవి 2 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాపిర్ 200ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. అపరాల కోత తర్వాత లీటరు నీటికి 2,4D సోడియం సాల్ట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. భూములను సకాలంలో దున్నడం, 2,3 ఏళ్లకు లోతు దుక్కులతో ఈ సమస్యను తగ్గించవచ్చు.
Similar News
News January 16, 2026
వంటింటి చిట్కాలు

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.
News January 16, 2026
కేంద్ర విద్యుత్ సవరణ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ TG నివేదిక

TG: కేంద్ర ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025లోని కొన్ని నిబంధనలను TG వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ERCలకు పూర్తి అధికారాలు, విద్యుత్ సబ్సిడీల హేతుబద్ధీకరణ, పరిశ్రమలు నేరుగా విద్యుత్ కొనుగోలు వంటి నిబంధనల్ని కేంద్రం ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రెండు డిస్కంలు నివేదికను సిద్ధం చేశాయి. CM అనుమతితో అధికారులు దీన్ని కేంద్రానికి సమర్పించనున్నారు.
News January 16, 2026
APలో స్మాల్ మిక్స్‌డ్ మాడ్యులర్ ఎనర్జీ రియాక్టర్

AP: థర్మల్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేలా చిన్నస్థాయిలో థర్మల్, హైడ్రో మిక్స్‌డ్ ఎనర్జీ రియాక్టర్‌ను నెలకొల్పేందుకు ఏపీ జెన్కో ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కోల్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ కింద దీనికి సంబంధించిన ప్లాంటు ఏర్పాటు ఆలోచన ఉందని జెన్‌కో ఎండీ నాగలక్షి ‘ది హిందూ’తో పేర్కొన్నారు. అయితే ఇది బొగ్గు రవాణా, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.


