News December 20, 2025
రైతుల అకౌంట్లలో ‘బోనస్’ డబ్బులు జమ

TG: రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. వీటికిగానూ రూ.13,833 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మీకు సన్న వడ్ల ‘బోనస్’ పడిందా?
Similar News
News December 26, 2025
రాష్ట్రంలో తగ్గిన విదేశీ విద్యార్థులు

TG: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2012-13లో రాష్ట్రంలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 1,286కు చేరుకుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఫలితంగా దేశంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్-10 రాష్ట్రాల లిస్టులో ప్లేస్ కోల్పోయింది. అటు ఏపీలో ఫారిన్ స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. 2012-13లో 679గా ఉన్న సంఖ్య పదేళ్లలో 3,106కు చేరింది.
News December 26, 2025
నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతుంటాడు?

నారద ముని ఒకచోట నిలకడగా ఉండలేరన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. సృష్టి కార్యంలో భాగంగా దక్ష ప్రజాపతి కుమారులు సంసారంలో పడకుండా, నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధించి సన్యాసులుగా మారుస్తాడు. దీనితో కోపించిన దక్షుడు, నారదుడు ఎక్కడా రెండు గడియల కంటే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేలా శాపం ఇస్తాడు. అది లోకకల్యాణానికి దారి తీసింది.
News December 26, 2025
చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి?

కాంతార ఛాప్టర్-1లో మెరిసిన రుక్మిణి వసంత్ త్వరలో పట్టాలెక్కనున్న చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా చేయనున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సమ్మర్‌లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’లో నటిస్తుండగా, తారక్-నీల్ సినిమాలో రుక్మిణి వర్క్ చేస్తున్నారు. కాగా తెలుగులో చరణ్, తారక్ నటన అంటే తనకు ఇష్టమని ఓ ఈవెంట్లో రుక్మిణి చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.


