News April 21, 2024
దేశంలో ఆ ఘనత ఒంటిమిట్ట రాములోరి సొంతం

ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరొచ్చింది. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
Similar News
News March 4, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,512 మంది హాజరు.!

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ మ్యాథమాటిక్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించారు. 12,888 మంది విద్యార్థులకు గాను.. 12,512 మంది పరీక్షలు రాశారు. 375 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 11,738 మందికి గాను.. 11,427 మంది విద్యార్థులు హాజరయ్యారు. 311 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,150 మందికి గాను.. 1,085 మంది పరీక్షలు రాశారు. 65 మంది ఆబ్సెంట్ అయ్యారు.
News March 4, 2026
మైదుకూరు: నోటికాడి ఆహారాన్ని కూడా వదలరా.?

కడప జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి మైదుకూరులో దాడులు చేసి పీడీఎస్‌కు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్ల ముద్ర కలిగిన గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అక్రమార్కులు బడి పిల్లలు, పసి పిల్లల అన్నాన్ని సైతం వదలకుండా అమ్ముకుంటున్నారు.
News March 4, 2026
ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ASP

మాజీ సీఎం YS జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం YS జగన్ పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంగళవారం ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్‌తో కలిసి ASP తనిఖీ చేశారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రొద్దుటూరుకు YS జగన్ వస్తున్నారు.


