News December 20, 2025

నల్లమలలో పులి సంచారం.. కృష్ణాతీర గ్రామాల్లో హైఅలర్ట్

image

<<18614933>>పెద్దపులి<<>> దారి తప్పి కొల్లాపూర్ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కృష్ణానదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా పెద్దపులి సంచరిస్తుందని వదంతులు రాగా.. సోమశిల, యంగంపల్లి, అమరగిరిలో పెద్దపులి జాడలు కనిపించయని కొల్లాపూర్ రేంజ్ అధికారి హుస్సేన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెద్దపులిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Similar News

News January 16, 2026

12,000 మంది మృతి.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు!

image

ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 12 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మెషీన్ గన్లతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వందల మృతదేహాలు ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని లేదంటే సామూహిక సమాధి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కాల్పులు ఆగినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

News January 16, 2026

చిత్తూరు: అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. ‘సమాచార శాఖ.కుప్పం’ గ్రూపులో I&PR డీడీ పేరిట న్యూడ్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు ఓ APK ఫైల్ సైతం వచ్చింది. దీంతో ఇతర ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రూపులో ఆ వీడియోలు తొలగించారు. డీడీ ఫోన్ హ్యాక్ కావడంతోనే ఇలా జరిగిందని సమాచారం. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

News January 16, 2026

ఈనెల 18న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన

image

ఈనెల 18న పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. మద్దులపల్లి నుంచి వర్చువల్‌గా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, ఏదులాపురంలో కొత్తగా నిర్మించిన వ్యసాయ మార్కెట్, నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలో సీఎం సమావేశం కానున్నారు.