News December 20, 2025
సంగారెడ్డి: రూమ్‌లో లవర్స్.. నాన్న ఎంట్రీతో విషాదం!

8వ అంతస్తు నుంచి జారిపడి యువతి మృతిచెందిన ఘటన SRDజిల్లా రామచంద్రపురం మం.లో జరిగింది. వివరాలు.. HYDకు చెందిన యువతి(20) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొల్లూర్ 2BHKలో ఉన్న ఇంటికి యువతి ఆ యువకుడితో వచ్చింది. ఆ సమయంలో తండ్రి ఇంటికి రావడంతో భయపడిన ఆమె బాల్కనీ గుండా పక్క ఫ్లాట్‌కు వెళ్లే ప్రయత్నంలో జారిపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 18, 2026
బల్కంపేట్ ఎల్లమ్మకి మౌని అమావాస్య ప్రత్యేక పూజలు

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.
News January 18, 2026
సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.
News January 18, 2026
అలంపూర్: దక్షిణ కాశీలో బ్రహ్మోత్సవ సంబరం

అలంపూర్ క్షేత్రంలో కొలువై ఉన్న శక్తిపీఠం శ్రీ జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో దీప్తి రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 19 (సోమవారం) నుంచి 23 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృప పొందాలన్నారు.


