News December 20, 2025
కలుపుతో వ్యవసాయానికి ముప్పు.. నివారణ ఎలా?

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కలుపు. వయ్యారిభామ, లింగ మిర్యాల, తుంగ, బంగారు తీగ సహా ఇతర కలుపు మొక్కలు పొలంలో పెరిగి.. ప్రధాన పంటకు అందించే పోషకాలను, ఎరువులను గ్రహించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి. కొన్ని వైరస్‌లకు ఆశ్రయమిచ్చి పంటల్లో తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వయ్యారి భామ సహా వివిధ కలుపు మొక్కల నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News January 11, 2026
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలి: హైకోర్టు

AP: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను, పేకాటను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపింది. జంతు హింస నిరోధక చట్టం-1960, జూద నిరోధక చట్టం-1974 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కోడి పందేలు, బెట్టింగ్‌లపై కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అన్ని మండలాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలంది.
News January 11, 2026
215 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI)లో 215 పోస్టులకు అప్లైకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 11, 2026
అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత రక్షణ బడ్జెట్ 2026పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఈ రంగానికి ₹6.8 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ నిధులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా సైనిక విస్తరణను అడ్డుకోవడానికి, ఆయుధాల ఆధునికీకరణ, స్వదేశీ తయారీకి ప్రాధాన్యం నేపథ్యంలో పెంపు తప్పదని విశ్లేషిస్తున్నారు. అమెరికా డిఫెన్స్ బడ్జెట్‌ను ఏకంగా 50% పెంచుతామని ట్రంప్ ప్రకటించారు.


