News December 20, 2025
సండే ‘బడ్జెట్’!

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈసారి సెలవు రోజైన ఆదివారం(2026 FEB 1) ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2017 నుంచి బడ్జెట్‌ను FEB 1న ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుండటమే దీనికి కారణం. పార్లమెంట్ సండే జరగడం అరుదైన విషయమే అయినా, ఈసారి నిర్వహించే ఛాన్స్ ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర మంత్రి రిజిజు మాట్లాడుతూ.. సరైన సమయంలో క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Similar News
News January 23, 2026
నెల్లూరు: SP- సంపర్క్ కార్యక్రమానికి శ్రీకారం

‘డయల్ యువర్ SP.’ (SP- సంపర్క్) అనే పోలీస్ సిబ్బంది గ్రేవియన్స్ కార్యక్రమానికి ఎస్పీ డా. అజిత వేజెండ్ల శ్రీకారం చుట్టారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ‘డయల్ యువర్ SP.’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.00 నుంచి 5.00 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
News January 23, 2026
త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
News January 23, 2026
సింగరేణి టెండర్లపై విచారణ కోరుతూ కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ

TG: నైనీ కోల్ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అన్ని టెండర్లను రద్దు చేయాలని కోరారు. సింగరేణి టెండర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జడ్జితో కుదరకపోతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ సింగరేణిలో మరో <<18937157>>3 స్కామ్‌లకు<<>> పాల్పడ్డారని హరీశ్ ఆరోపించారు.


