News April 21, 2024
యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీకి అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ నెట్’కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10న రాత్రి 11.50గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లుంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరిచేసుకోవచ్చు.
Similar News
News February 1, 2026
జిల్లాకో గర్ల్స్ హాస్టల్: కేంద్రం ప్రకటన

సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయాలని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. కాలేజీ తరగతులు, ల్యాబుల్లో పరిశోధనలు ఇతర అధ్యయనాలకు ఎక్కువ కాలం వారు వెచ్చించాల్సి వస్తోంది. వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వారికి సదుపాయంగా ఈ హాస్టళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి వివరించారు.
News February 1, 2026
ట్యాక్స్ పేయర్స్‌కు పెద్ద ఉపశమనం

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) రివైజ్ చేసుకోవాలనుకునే వారికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంచి వెసులుబాటు కల్పించారు. తక్కువ ఫీజుతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. అయితే, ITR-1, 2 ఫైల్ చేయడానికి మాత్రం యథావిధిగా జులై 31 చివరి తేదీగా ఉంటుంది. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 2%గా నిర్ణయించారు. త్వరలోనే సరళీకరించిన కొత్త టాక్స్ రూల్స్ కూడా రాబోతున్నాయి.
News February 1, 2026
దేశ పురోగతికి ఆరు సూత్రాలు

ప్రపంచ పరిణామాలను అందిపుచ్చుకొంటూ దేశం మరింత ముందుకు సాగేలా కేంద్రం బడ్జెట్లో ఆరు సూత్రాలను ప్రకటించింది.
1. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ పెంచడం
2. పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ
3. MSMEలను ఛాంపియన్లుగా మార్చడం
4 మౌలిక సదుపాయాలకు మరింత ప్రోత్సాహం
5 దీర్ఘకాలిక స్థిర భద్రతను కల్పించడం
6 సిటీ ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి.


