News December 20, 2025
శ్రీకాకుళంలో సరిపడా యూరియా నిల్వలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీనాథ స్వామి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు 7,811 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ప్రైవేట్ డీలర్ల వద్ద 2,020 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.
Similar News
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.
News January 15, 2026
సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర
News January 15, 2026
ఎస్పీ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు

కవిరాజు, ప్రముఖ సాహిత్య, సామాజిక వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధనపు ఎస్పీ శ్రీనివాసరావు రామస్వామి చౌదరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలు కుల వివక్షత అసమానతలపై ఆయన నిర్భయంగా పోరాటం చేశారన్నారు. మానవతా విలువలు చాటి చెప్పారన్నారు.


