News December 20, 2025
MDK: రైతు కుమారుడికి గ్రూప్-3 జాబ్

TSPSC గురువారం విడుదల చేసిన గ్రూప్-3 పరీక్షా ఫలితాల్లో చిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లికి చెందిన మధు వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు శారద, యాదగిరిలు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారుడు మధును కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చడం గర్వంగా ఉందని, గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యమని మధు తెలిపారు.
Similar News
News January 12, 2026
BIG BREAKING: మేడారంలో క్యాబినెట్ మీటింగ్!

తెలంగాణ క్యాబినెట్ సమావేశాన్ని మేడారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రజలకు తెలిసేలా క్యాబినెట్ మీటింగ్‌ను ఈనెల 19న మేడారంలో నిర్వహించాలని CM రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 18న CM సహా మంత్రులు మేడారానికి వచ్చి, అక్కడే బస చేస్తారు. 19న ఉదయం మేడారం గద్దెలను ప్రారంభించి, అక్కడే క్యాబినెట్ మీటింగ్‌లో పాల్గొంటారు.
News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
News January 12, 2026
భద్రాద్రి జిల్లాలో 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సమీక్ష నిర్వహించారు. అనంతరం భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా, సంబంధిత పాఠశాలలకు భూమిని కేటాయించడం జరిగిందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.


