News December 20, 2025

నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

image

నెల్లూరు జిల్లాలో హైరిస్క్‌ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్‌’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.

Similar News

News January 17, 2026

నెల్లూరు: డ్రస్ సర్కిల్’ డ్రా విజేతకు కార్ అందజేత

image

నెల్లూరులోని ప్రముఖ వస్త్ర దుకాణం ‘డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్’లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ‘భలే ఛాన్స్ బాసు’ లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగిన వస్త్రాల కొనుగోళ్లపై కూపన్లు అందించారు. ఈ డ్రాలో N.దయాకర్ రెడ్డి (కూపన్ నంబర్: 21038) మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నారు.

News January 17, 2026

కోడి పందాలపై కఠినంగా.. బీచ్ భద్రతపై ఎందుకీ నిర్లక్ష్యం?

image

కోడి పందాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినా, సముద్ర తీర ప్రాంతాల భద్రతపై మాత్రం అదే స్థాయి పర్యవేక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 2న మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకులు మృతి చెందగా, తాజాగా శుక్రవారం అల్లూరు బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. లైఫ్‌గార్డులు, హెచ్చరిక బోర్డులు, పోలీస్ పర్యవేక్షణ లోపించడం ప్రమాదాలకు కారణమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

image

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.