News April 21, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

image

రొళ్ల మండల రంగాపురం క్రాస్ అలుపునపల్లి సమీపంలో బైక్‌లో ఇద్దరు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన వారికిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2026

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై దుష్ప్రచారం

image

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1993 డిసెంబర్ 21న పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను తాజాగా జరిగినట్టుగా, బంగారు విగ్రహాల విలువ రూ.150 కోట్లుగా వక్రీకరిస్తున్నారు. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విగ్రహాల విలువ రూ.50 వేలుగా నమోదు చేసి, 1994లో కేసు మూసివేశారు.

News March 4, 2026

అనంతపురంలో పడిపోయిన ధరలు

image

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.

News March 3, 2026

అనంత: జాగ్రత్త.. ఇది డేంజర్ స్పాట్

image

కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు డేంజర్ స్పాట్‌గా మారింది. ఇటీవల అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 15 రోజుల క్రితం 2 బైకులు డీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. నెల రోజుల క్రితం అక్కడే ట్రాక్టర్, కారు డీకొన్నాయి. మలుపు ప్రమాదకరంగా మారడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.