News December 20, 2025

ఎలా మాట్లాడాలంటే?

image

ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి ఎక్కువ వాదించకూడదు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్‌ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశాన్నే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి ఏ విషయాన్నైనా స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.

Similar News

News January 18, 2026

కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

image

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.

News January 18, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.

News January 18, 2026

రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

image

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.