News December 20, 2025
పల్నాడు: పొదుపు సంఘాల ముసుగులో రూ. 20 కోట్ల స్కామ్

పేదరిక నిర్మూలనకు అండగా ఉండాల్సిన సంస్థే పేద మహిళల ప్రాణాలతో చెలగాటమాడింది. బోగస్ పొదుపు సంఘాలను సృష్టించి, బ్యాంకుల నుంచి సుమారు రూ.20కోట్ల మేర అక్రమంగా రుణాలు పొందినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. మహిళలు కష్టపడి చెల్లించిన పొదుపు సొమ్మును కూడా సంస్థ ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ భారీ ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Similar News
News January 7, 2026
MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.
News January 7, 2026
ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
News January 7, 2026
అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.


