News December 20, 2025

కొండంత లక్ష్యం.. ఎదురొడ్డుతున్న ఇంగ్లండ్

image

యాషెస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు ఆదిలోనే ఓపెనర్ డకెట్(4) వికెట్ కోల్పోయింది. తర్వాత పోప్(17) కూడా ఔట్ అయ్యారు. దీంతో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో క్రాలే, రూట్ ఉన్నారు. ఆట ఇవాళ, రేపు మిగిలి ఉండగా ENG టార్గెట్‌ను ఛేదించడం గగనమే.

Similar News

News January 17, 2026

ICMR-NIIRNCDలో ఉద్యోగాలు

image

<>ICMR<<>>-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(NIIRNCD) 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://niirncd.icmr.org.in

News January 17, 2026

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ: CM

image

AP: చరిత్ర తిరగరాయడంలో తెలుగువాళ్లు ముందున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కాకినాడలో AM గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ ఇది. 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఏడాది క్రితం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా ఎగుమతి చేస్తాం’ అని పేర్కొన్నారు.

News January 17, 2026

‘నల్లమల సాగర్’పై కేంద్రానికి తెలంగాణ షాక్

image

TG: ‘నల్లమల సాగర్’పై AP డీపీఆర్ ప్రక్రియను నిలిపి వేయకపోతే JAN 30న ఢిల్లీలో జరిగే కమిటీ భేటీలో పాల్గొనబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తమ డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే కమిటీ భేటీకి తమ అధికారులు రారని తేల్చిచెప్పారు. AP అక్రమ ప్రాజెక్టులపై విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.