News December 20, 2025
ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.
Similar News
News January 17, 2026
ఇంద్రవెల్లి: మర్రి చెట్ల చెంతకు చేరిన మెస్రం వంశీయులు

ఈనెల 18న నిర్వహించే నాగోబా మహా పూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు కేస్లాపూర్ పొలిమేరకు చేరుకున్న విషయం తెలిసిందే. మరి చెట్టు వద్దనే ఆదివారం వరకు గడపనున్నారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలను సిరికొండ వెళ్లి మెస్రం వంశీయులు తీసుకొని వచ్చి ఆలయ వెనుక భాగంలో భద్రపరిచారు. ఆదివారం రాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి తెలిపారు.
News January 17, 2026
NLG: మున్సిపాలిటీల్లో ఆధిపత్యం ఆమెదే!

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 21,014 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మహిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా BRS, BJP సైతం మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
News January 17, 2026
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామకివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


