News December 20, 2025
ఇండియా దెబ్బ.. పాకిస్థాన్ దొంగ ఏడుపు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఇప్పుడు పాక్‌లో కనిపిస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉండటంతో పాక్ డిప్యూటీ PM ఇషాక్ దార్ మొసలి కన్నీళ్లు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగా సింధు జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని, తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశానికి ఇదే సరైన సమాధానమని పలువురు అంటున్నారు.
Similar News
News January 7, 2026
ఒకటిన్నర ఎకరా పొలం.. అద్భుత ఆలోచనతో అధిక ఆదాయం

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.
News January 7, 2026
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News January 7, 2026
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 84,920 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 26,122 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టైటాన్, ఇన్ఫీ, HCL, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో.. TMPV, HDFC, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.


