News December 20, 2025
విడాకులపై DHC తీర్పు.. భిన్నాభిప్రాయాలు!

పరస్పర అంగీకారం ఉంటే కొన్ని సందర్భాల్లో ఏడాది గ్యాప్ లేకున్నా విడాకుల కోసం ఫస్ట్ మోషన్ దాఖలు చేయొచ్చని ఢిల్లీ HC తాజాగా పేర్కొంది. ప్రతి కపుల్ ఏడాది వేరుగా ఉండాల్సిన అవసరం లేదన్న ఈ కామెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సొంత జీవితాల్లో త్వరగా ముందుకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని పలు యువ జంటలు పేర్కొన్నాయి. అయితే డివోర్స్‌ను మరింత ప్రోత్సహించే ప్రమాదముందన్నది సీనియర్ సిటిజన్స్ ఆందోళన.
Similar News
News January 18, 2026
కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.
News January 18, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<
News January 18, 2026
రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.


