News December 20, 2025

జగిత్యాల జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుల్లకోటలో 15.4℃లు నమోదుకాగా సారంగాపూర్, గోవిందారం 15.7, పూడూర్ 15.8, ఎండపల్లిలో 16.0గా నమోదైంది. కథలాపూర్, మల్యాల, సిరికొండ, మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల, గొల్లపల్లి, మారేడుపల్లి, నేరెళ్ల, మెట్‌పల్లి, గోదూరు, వెల్గటూర్, బుద్ధేశ్‌పల్లి, కొల్వాయి, పొలాస, రాయికల్, అల్లీపూర్ ప్రాంతాల్లో 16.1℃గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే చలి కాస్త తగ్గింది.

Similar News

News January 15, 2026

పసిడి మనసుల పండుగ ‘బొమ్మల కొలువు’

image

సంక్రాంతికి తెలుగు ఇళ్లలో ఆచరించే ముచ్చటైన సంప్రదాయం బొమ్మల కొలువు. ఇంట్లోని దేవతా మూర్తులు, జానపద కళారూపాలు, వృత్తులను ప్రతిబింబించే మట్టి బొమ్మలను మెట్ల ఆకారంలో అమర్చుతారు. ఇది అలంకరణే కాదు. భావితరాలకు మన సంస్కృతి, పురాణ గాథలను పరిచయం చేసే ముఖ్య వేదిక. ఆడపిల్లలు, మహిళలు పేరంటాలకు పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సృజనాత్మకతను, ఆత్మీయతను పెంచే ఒక అందమైన వేడుక.

News January 15, 2026

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. రూ.100 కోట్ల ఆదాయం

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా TGSRTC ఈ నెల 9 నుంచి 14 వరకు 6 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపింది. ఈ ఆరు రోజుల్లో సుమారు 2.40 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా రూ.100 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి APSRTC బస్సులు హైదరాబాద్‌కు రాకపోవడం కూడా కలిసొచ్చింది. పండుగ తర్వాత జనవరి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

News January 15, 2026

కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

image

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.