News December 20, 2025
ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్‌లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 10, 2026
KMM: ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మం ఎస్సీ స్టడీసర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఐదు నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 20 నుంచి తరగతులు ప్రారంభిస్తామని.. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 10, 2026
ఖమ్మం: 12న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక

ఆదిలాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఖమ్మం జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 12న నిర్వహించనున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొని జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆయన కోరారు.
News January 10, 2026
KMM: చిరుత దహనంపై ‘నిశ్శబ్ద’ దర్యాప్తు.. నిందితులెవరు?

ఖమ్మం జిల్లా పులి గుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం దహనం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అసలు ఏడాది కాలంగా ఈ విషయాన్ని ఎందుకు దాచారు? చిరుత గోళ్లు, చర్మం ఏమయ్యాయి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. అటవీశాఖలో అధికారుల మార్పులు జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


