News December 20, 2025

GNT: ఆర్థిక భారమా.. దీర్ఘకాలిక ప్రయోజనమా?

image

ప్రభుత్వ కఠిన నియంత్రణ చర్యలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అపార్ట్‌మెంట్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల నిబంధనల అమలులో భాగంగా అక్రమ నిర్మాణాలు, డివియేషన్‌ల వల్ల G+3 నియమాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ ధరలు రూ. 40 నుంచి రూ.55 లక్షల వరకు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది. దీనిపై మీ COMMENT

Similar News

News January 15, 2026

డోన్: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

డోన్ మం. దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చిట్యాలకు చెందిన తలారి మధుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 15, 2026

ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

News January 15, 2026

HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

image

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.