News December 20, 2025

రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

image

TG: చాలారోజుల తర్వాత గులాబీ బాస్ KCR పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. రేపు మ.2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ​‘ఏపీ జల దోపిడీ-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై మాట్లాడనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై KCR దిశానిర్దేశం చేస్తారని BRS వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఆయన సూచనలు చేస్తారని చెప్పాయి.

Similar News

News January 15, 2026

KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

image

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.

News January 15, 2026

మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

image

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.

News January 15, 2026

రాజ్యాంగానికి రాహుల్, రేవంత్ తూట్లు: KTR

image

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ <<18864508>>క్లీన్‌చిట్<<>> ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే. రాహుల్, రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. జంప్ జిలానీలకు, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా BRS పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.