News December 20, 2025
సూర్యాపేట: 4 GOVT జాబ్స్ కొట్టిన యువకుడు

కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధిస్తారని మాటను నిజం చేశాడు ఆ యువకుడు. పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని నిరూపిస్తూ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లింగంపల్లికి చెందిన వీరబోయిన దయాకర్ ప్రస్థానం ఒకే ఉద్యోగంతో ఆగిపోలేదు. ఆయన వీఆర్వో, ఆర్‌ఆర్బీ టెక్నీషియన్, PCతోపాటు, తాజాగా విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు.
Similar News
News January 19, 2026
విద్యార్థిగా సీఎం రేవంత్

TG: యూఎస్ హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారనున్నారు. కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ‘లీడర్‌షిప్ ఫర్ ది 21st సెంచరీ’ ప్రోగ్రామ్‌కు ఆయన ఈ నెల 25-30 వరకు హాజరవుతారని CMO తెలిపింది. మొత్తం 20దేశాల నుంచి నేతలు ఈ క్లాసులకు హాజరుకానున్నారు. పలు అంశాలపై ఆయన అసైన్‌మెంట్స్‌తోపాటు హోంవర్క్ కూడా చేయనున్నారు. భారత్ నుంచి సీఎం హోదాలో హాజరవుతున్న తొలి వ్యక్తి రేవంతే.
News January 19, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓భద్రాద్రి నుంచి వందేళ్ళ సభకు సీపీఐ శ్రేణులు
✓జిల్లాలో తూనికల శాఖ అధికారి తనిఖీలు
✓జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం
✓వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
✓పాల్వంచ పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదం ముగ్గురికి గాయాలు
✓కొత్తగూడెం: రామవరంలో రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
✓రేపు ఆళ్లపల్లి, పాల్వంచలో పవర్ కట్
✓ఐటీడీఏ భద్రాచలంలో రేపు గిరిజన దర్బార్
News January 18, 2026
ఎగ్జామ్ లేకుండానే.. నెలకు రూ.12,300 స్టైపండ్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APలో 11, తెలంగాణలో 17 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. వయసు 20-28 ఏళ్లు. ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. నెలకు రూ.12,300 స్టైపండ్ ఇస్తారు. అప్లికేషన్లకు చివరి తేదీ JAN 25. 12వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తి వివరాల కోసం <


