News December 20, 2025
తాడేపల్లి: KCR, KTR ఫొటోలతో జగన్ ఇంటి వద్ద కటౌట్లు

తాడేపల్లిలోని మాజీ CM జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు రాజకీయ కటౌట్లు వెలిశాయి. అయితే ఒక కటౌట్‌లో తెలంగాణ మాజీ CM KCR, KTR ఫొటోలూ ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. TGలోని షేర్ లింగంపల్లికి చెందిన BRS నేత చిర్రా రవీందర్ యాదవ్ దీనిని ఏర్పాటు చేశారు. APలోనే కాదు TGలోనూ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
నేడు మంగళగిరిలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం మంగళగిరిలోని తాడేపల్లి నగరపాలక సంస్థలో పర్యటించనున్నారు. పార్కులు, మోడల్ టాయిలెట్స్, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించనునట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కాజలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఆయా పనుల పరిశీలన అనంతరం 11 గంటలకు MTMC కార్యాలయంలో జరిగే నియోజకవర్గ సమీక్షలో పాల్గొననున్నట్లు ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News February 19, 2026
అమరావతిలో దసపల్లా హోటల్ పనులు షురూ

అమరావతిలో దసపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో లగ్జరీ గదులు, సూట్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్, హెల్త్ క్లబ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ హోటల్ రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో ఆతిథ్య రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.
News February 19, 2026
GNT: ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా సూచించారు. బుధవారం గుంటూరులో అధికారులు, సూపరింటెండెంట్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరని స్పష్టం చేశారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


