News December 20, 2025

SVU: ప్రొఫెసర్ కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారు..?

image

తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ విచారణ నుంచి బయట పడ్డ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారని ప్రచారం జరుగుతోంది. సైకాలజీ విభాగంలో సిబ్బంది తక్కువ ఉండడంతో తీసుకున్నారంటూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడవక ముందే.. కేసు విచారణలో ఉండగా ఆయనను తీసుకోవడం పై విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

Similar News

News December 21, 2025

ములుగు: రేపు పంచాయతీ పాలకవర్గాల పదవీ ప్రమాణం

image

నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు రేపు (22న)పదవీ ప్రమాణం చేయనున్నాయి. 146 మంది సర్పంచ్/ఉప సర్పంచ్, 1290మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. అధికారం చేపట్టేందుకు ప్రతినిధులు ఆసక్తితో ఉన్నారు. ఆ వెంటనే ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి ఊరి సమగ్రాభివృద్ధికి యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది.

News December 21, 2025

స్వయంకృషి: బేసిక్స్‌లో రెండోది.. బెస్ట్ Income!

image

బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఫుడ్ బెస్ట్ ఛాయిస్. మనిషికి ‘కూడు, గూడు, గుడ్డ’ కనీస అవసరాలు. ప్రాధాన్యతల వారీగా బట్టల తర్వాత ఆహారం తప్పనిసరి. మార్కెట్లో చాలా ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ ఉన్నా క్వాలిటీ క్వశ్చన్ ప్రజల్ని వెంటాడుతోంది. మీరు క్వాలిటీపై ఫోకస్ పెట్టి టీ అమ్మినా మంచి ఆదాయం చూస్తారు. సరైన వర్కర్లు, వాళ్లు లేకపోయినా చేసుకోగల సామర్థ్యం ఉంటే మీకు తిరుగుండదు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 21, 2025

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

image

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.