News December 20, 2025
NZB: నకిలీ నోట్లతో బ్యాంకర్ల అలెర్ట్

వర్ని బ్యాంకులో ఏకంగా రూ.2లక్షలకుపైగా నకిలీ నోట్లు బయట పడడంతో జిల్లా మొత్తం బ్యాంకర్లు అలెర్ట్ అయ్యారు. GP ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ చేసేందుకు డబ్బు ఎవరు తెచ్చినా బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకూ ఒకటి రెండు దొంగ నోట్లు అనే పరిస్థితి నుంచి అన్ని నోట్లు పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Similar News
News January 1, 2026
ఖమ్మం: ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్‌లో శశికళకు స్వర్ణం

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చిరునోములు గ్రామానికి చెందిన శశికళ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. బిహార్‌లో జరిగిన ఈ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడి దేశానికి పేరు తెచ్చారు. గతంలో తొమ్మిది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, కోచ్ శిక్షణే కారణమన్నారు. శశికళ సాధించిన ఈ ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News January 1, 2026
నల్గొండ కలెక్టర్ భూదాన్ పోచంపల్లి వాసి..!

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్ భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామ వాసి. చేనేత కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు 40 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారి తండ్రి నరహరి ప్రస్తుతం హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి నల్గొండ కలెక్టర్ అయ్యారు.
News January 1, 2026
WGL: పోలీసుల నిఘా ఫలితం.. కమిషనరేట్‌లో ‘సున్నా’ ప్రమాదాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రమాదరహితంగా ముగిశాయి. పోలీసులు చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ఫలితంగా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా నమోదు కాలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, వాహనదారుల వేగానికి బ్రేక్ వేయడంతోనే ఈ విజయం సాధ్యపడింది. ముఖ్యంగా ప్రమాదకరమైన మలుపులు, ప్రధాన రహదారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పర్యవేక్షించారు.


