News December 20, 2025

HISTORY: HYD నిజాం.. మస్క్ కంటే రిచ్!

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర ఆదాయం ఇటీవలే $677B దాటింది. కానీ ఇంతకంటే ఎక్కువ ఆదాయాన్ని 85ఏళ్ల క్రితమే HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలిగి ఉండేవారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 1937 నాటికే ఆయన సంపద విలువ నేటి లెక్కల ప్రకారం సుమారు ₹150 లక్షల కోట్లు ($1.8 ట్రిలియన్లు). అపారమైన భూములు, గోల్కొండ వజ్రాలు, రాజప్రాసాదాలతో అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఆయన గుర్తింపు పొందారు.

Similar News

News December 31, 2025

ఈ కోళ్ల మాంసం KG రూ.2 లక్షల పైనే..

image

సాధారణంగా కేజీ చికెన్ ధర కోడిని బట్టి రూ.1000లోపే ఉంటుంది. ఇంకా అరుదైనది అయితే రూ.2వేలు లోపే. అయామ్ సెమనీ, ఒనగడోరి జాతులకు చెందిన కోడి మాంసం మాత్రం కేజీ ధర అక్షరాల రూ.2 లక్షల పైమాటే. డాంగ్ టావో జాతి కోడి మాంసం కిలో రూ.లక్షన్నర పైనే. కొన్ని ప్రత్యేక లక్షణాలే దీనికి కారణం. అసలు ఈ కోళ్లకు ఎందుకు అంత ధర? కిలో రూ.లక్షలు పలికే ఈ కోళ్ల జాతులు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 31, 2025

టోల్ మినహాయించాలని లేఖ.. BRS విమర్శలు

image

TG: సంక్రాంతికి HYD-విజయవాడ మార్గంలో <<18708714>>టోల్<<>> మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. HYDలో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ADB, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.

News December 31, 2025

కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

AP: కృష్ణా జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/