News December 20, 2025

నల్గొండ: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?

image

జీపీ ఎన్నికల అనంతరం గ్రామాల్లో నూతన చర్చ జరుగుతోంది. సహకార, మార్కెటింగ్ సంస్థలకు పాలకవర్గాలను రద్దు చేయడంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సహకార సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సి ఉంది. దీంతో ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు.

Similar News

News December 24, 2025

కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

image

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.

News December 24, 2025

యాసంగి అవసరాలకు యూరియా సిద్ధం: మంత్రి తుమ్మల

image

తెలంగాణలోని రబీ సీజన్ అవసరాల కోసం ఇప్పటికే 5 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్‌ అమలు చేస్తున్నామని, 2 రోజుల్లోనే 19,695 మంది రైతులు 60,510 యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు.

News December 24, 2025

H.జంక్షన్‌లో మహిళ అనుమానాస్పద మృతి

image

H.జంక్షన్ లోని పశువుల సంత ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనంలో నివసిస్తున్న ఓ మహిళ బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ముఖానికి కవర్‌లు కట్టి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఘటనకు కారణమై ఉండొచ్చని చర్చ సాగుతోంది. మహిళ విజయనగరం, భర్త తిరువూరుకు చెందినవారు. ఘటన స్థలానికి క్లూస్ టీం, పెదపాడు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.