News December 20, 2025
విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి: CBN

AP: విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని CM CBN పేర్కొన్నారు. వారంతా నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే 75 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని చెప్పారు. కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం స్కూలు విద్యార్థులతో CM మాట్లాడారు.
Similar News
News January 12, 2026
సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్.. కారణమిదే!

స్టాక్ మార్కెట్ సూచీల్లో ఈరోజు భారీ బౌన్స్ బ్యాక్ కనిపించింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 1000 పాయింట్లు పుంజుకోవడం విశేషం. చివరకు ఈ సూచీ 301 పాయింట్లు లాభపడి 83,878 వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,790 దగ్గర స్థిరపడింది. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై అమెరికా నియమిత రాయబారి సెర్గియో గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలు సూచీలను పైకి లేపాయి. దీంతో 5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది.
News January 12, 2026
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి: CBN

AP: నిధులు లేవని పనులు ఆపొద్దని, క్రియేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్లాలని CBN సూచించారు. PPP పద్ధతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆదేశించారు. ‘కేంద్ర నిధులను కొన్ని శాఖలు ఖర్చు చేయడం లేదు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చే అవకాశమున్నా ఖర్చు చేయలేదు. నెలాఖరులోగా పూర్తి చేసి అదనపు నిధులు కోరాలి. కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు’ అని CM పేర్కొన్నారు.
News January 12, 2026
టిమ్ కుక్ తర్వాత యాపిల్ బాస్ ఇతనేనా?

యాపిల్ CEOగా టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 50 ఏళ్ల ఈ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్ 2001 నుంచే కంపెనీలో ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వంటి హిట్ ప్రొడక్ట్స్ వెనుక ఇతని హస్తం ఉంది. కాలేజీ రోజుల్లో వర్సిటీ స్విమ్మర్ అయిన టెర్నస్ ఇప్పుడు యాపిల్ పగ్గాల కోసం రేసులో ముందున్నారు. ఆయన డీటైలింగ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ యాపిల్‌కు కొత్త వెలుగునిస్తాయని భావిస్తున్నారు.


