News December 20, 2025

చీపురు పట్టిన కర్నూలు కలెక్టర్ సిరి

image

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.సిరి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 25, 2025

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కలెక్టర్ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు దంతాలను కాపాడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News December 25, 2025

తెలుసా..?: 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

image

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్‌లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్‌ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త.

News December 25, 2025

తిరుపతిలో CM పర్యటన ఇలా..!

image

తిరుపతిలో సీఎం చంద్రబాబు, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్‌కు సీఎం వస్తారు. 10.05 గంటలకు సంస్కృత విద్యాపీఠంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఎస్పీ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు తిరిగి ఉండవల్లికి రిటర్న్ అవుతారు.