News December 20, 2025
తాళ్లపాలెం: పిల్లల ద్వారా వ్యక్తిగత శుభ్రత తెలసుకున్న సీఎం

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం బాలికల గురుకులంలో సీఎం చంద్రబాబుకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. గురుకులంలో తరగతి గదులు, డిస్పెన్సరీ, ఇతర ప్రాంగణాలను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గురుకులంలో చదువుతున్న బాలికలే కొన్ని అంశాలను చంద్రబాబుకు వివరించారు. వ్యక్తిగత శుభ్రత లేకపోతే లీడర్లుగా తామే అనుమతించమని చెప్పారు. ఈ వ్యక్తిగత శుభ్రత ఎలా చేపడతారో నేరుగా సీఎం పిల్లల ద్వారా తెలుసుకున్నారు.
Similar News
News January 7, 2026
MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)
News January 7, 2026
పాలమూరు: పిల్లల అంత్యక్రియలకు రాని తల్లి.. స్థానికుల ఆగ్రహం

తన <<18785141>>ఇద్దరు పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య <<>>చేసుకున్న ఘటనలో తల్లి తీరు వివాదాస్పదంగా మారింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరులో మంగళవారం సాయంత్రం పిల్లల అంత్యక్రియలు జరగగా, పోలీసులు సమాచారం ఇచ్చినా తనకు సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పినట్లు సమాచారం. బంధువులే అంత్యక్రియలు పూర్తి చేయగా, కన్నపిల్లల చివరి చూపునకు కూడా రాని ఆమె కఠిన స్వభావంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News January 7, 2026
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

AP: రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది. మంత్రి నారాయణ గుంటూరు(D) వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ 2.0ను స్టార్ట్ చేశారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో గ్రామసభ నిర్వహించనున్నారు. కాగా ఈ విడతలో రైతుల నుంచి CRDA 16,666 ఎకరాలను సమీకరించనుంది.


