News December 20, 2025

మంగళగిరి: 79వ రోజు మంత్రి లోకేశ్‌ ‘ప్రజాదర్బార్’

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. RTCలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరగా, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Similar News

News December 26, 2025

గుంటూరు: రూ.53 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

image

సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని SP పేర్కొన్నారు.

News December 26, 2025

GNT: దిగ్గజ నిర్మాత ఏ.వి సుబ్బారావు

image

గుంటూరు జిల్లా అనంతవరంనకు చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి సుబ్బారావు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఆణిముత్యాలను ఆయన నిర్మించారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి గాను తెలుగులో తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగానూ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.

News December 26, 2025

GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

image

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.