News December 20, 2025

కామారెడ్డి: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

కామారెడ్డి మండలం గర్గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన అండర్-14, 17 విభాగంలో పాఠశాలలో చదువుతున్న బాలబాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లయ్య తెలిపారు.

Similar News

News January 10, 2026

సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

image

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.

News January 10, 2026

NGKL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ మండలంలో 11.6, బల్మూర్ మండలంలో 12.0, తెలకపల్లి, వెల్దండ మండలలో 12.5, లింగాల మండలంలో 13.0, పదర మండలంలో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 10, 2026

దేవీపట్నం: క్రికెట్ ఆడి వచ్చిన యువకుడు కుప్పకూలి మృతి

image

దేవిపట్నం మండలం పరగసానిపాడు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు అప్పటివరకు బ్యాటింగ్ చేసి అవుట్ కావడంతో మంచినీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు.