News December 20, 2025

ఈనెల 23న నల్గొండలో జాబ్ మేళా

image

జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న (మంగళవారం) జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను నల్గొండలోని ఐటీఐ క్యాంపస్‌లో ఉదయం జరుగుతుందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి 10th, డిగ్రీ అర్హత గలవారు విచ్చేయాలని కోరారు.

Similar News

News December 26, 2025

NLG: సీఎం ప్రకటన.. సర్పంచులకు ఊరట!

image

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,779 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.

News December 26, 2025

NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

image

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.

News December 26, 2025

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ

image

మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఆయనను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. నారాయణ్ అమిత్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.