News December 20, 2025

డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్

image

మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ, రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కదిరి R&B గెస్ట్ హౌస్‌ నుంచి మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి యువత ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమన్నారు.

Similar News

News December 28, 2025

పిఠాపురంలో రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

image

పిఠాపురంలో ‘పాడా’ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీదారుల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

News December 28, 2025

నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(NFSU) 31 నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, BLSc, MLSc, NET/SLET, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://beta.nfsu.ac.in

News December 28, 2025

సిరిసిల్ల: ‘కలెక్టరేట్‌లో ప్రజలను ఆకర్షిస్తున్న ఫ్లెక్సీ’

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ‘నిజమైన హీరోలు లంచం ఇవ్వరు’ అనే ఫ్లెక్సీ వెలిసింది. ఇటీవల ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న క్రమంలో ఏసీబీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆకర్షిస్తుంది. అధికారులు లంచం అడిగితే 1064 నంబర్‌ను సంప్రదించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.