News December 20, 2025
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ అధ్యాపకుడికి డాక్టరేట్ పట్టా

KNR నగరంలోని SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు శంకరయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయన ‘సింథసిస్ బయోలాజికల్ ఎవల్యూషన్ అండ్ మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ బెంజిమెడజోల్’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేశారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, సత్య ప్రకాష్, సంజీవ్ తదితరులు శంకరయ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
Similar News
News December 24, 2025
RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
News December 24, 2025
రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.


