News December 20, 2025

గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI

image

గుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని <<18572969>>జరుగుతున్న<<>> ప్రచారాన్ని FSSAI ఖండించింది. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో ప్రమాదకర నైట్రోఫ్యూరాన్‌లు, యాంటీబయాటిక్‌లపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ‘గరిష్ఠంగా KGకి 1.0 మైక్రోగ్రామ్ నైట్రోఫ్యూరాన్లు ఉండొచ్చు. వీటివల్ల ప్రమాదం లేదు. ఫుడ్ సేఫ్టీ వయలేషన్‌గా పరిగణించలేం. నైట్రోఫ్యూరాన్లకు క్యాన్సర్‌కు సంబంధం లేదు. మన దేశంలో గుడ్లు సురక్షితం’ అని స్పష్టం చేసింది.

Similar News

News December 31, 2025

ట్రైనీ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

image

క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతున్న 205 ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నైపుణ్యం అవసరమి చెప్పారు.

News December 31, 2025

న్యూఇయర్ వేళ మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో న్యూఇయర్ వేళ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18719998>>మళ్లీ<<>> తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.980 తగ్గి రూ.1,35,220కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.900 పతనమై రూ.1,23,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 31, 2025

ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ముగ్గురికి జన్మనివ్వండి: అస్సాం CM

image

హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని, ఇద్దరిని కనాలని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ కోరారు. అవకాశం ఉన్నవాళ్లు ముగ్గురికి జన్మనివ్వాలన్నారు. రాష్ట్రంలో హిందువుల బర్త్ రేట్ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 7-8 మంది పిల్లల్ని కనొద్దని ముస్లింలను కోరారు. AP CM CBN కూడా ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని కోరుతున్న విషయం తెలిసిందే.