News April 21, 2024
కూకట్‌పల్లిలో దారుణం.. అత్యాచారం చేసి హత్య?

హైదరాబాద్‌లో దారుణఘటన వెలుగుచూసింది. ఆదివారం కూకట్‌పల్లి PS పరిధి AR పైప్ వర్క్ షాప్ సెల్లార్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. విష్ణు ప్రియ లాడ్జి సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి 45 ఏళ్లు ఉంటాయని సమాచారం.
Similar News
News September 12, 2025
HYD: నకిలీ ఐటీసీ కుంభకోణం.. ఈడీ దాడులు

నకిలీ ఐటీసీ కుంభకోణంపై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో 10 చోట్ల ED దాడులు చేస్తుంది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ఈడీ సోదాలు నిర్వహించింది. కోట్లాది రూపాయల నకిలీ ఇన్‌వాయిసులు, కాగితాలపైనే వ్యాపారం చేశారు. షెల్ కంపెనీల ఖాతాల ద్వారా రూ.650 కోట్లు బదిలీలు చేశారు. మేలో అరెస్టైన శివకుమార్ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. మరికొందరు వ్యక్తులు, సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది.
News September 12, 2025
HYD: BRO ట్రాఫిక్ ఉల్లంఘిస్తే మెసేజ్ చేయండి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా.. 9490617346కు వాట్సప్ ద్వారా లొకేషన్, డిటైల్స్ ఎంటర్ చేసి, ఫొటోతో పంపాలన్నారు. ఓ వ్యక్తి ఇటీవల హెల్మెట్ ధరించకపోవడంపై అధికారులు స్పందించారు.
News September 12, 2025
ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

సైన్స్, టెక్నాలజీ రంగాలలో దేశం గ్లోబల్ లీడర్‌గా నిలవాలంటే పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లోని CSIR–IICTలో జరిగిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ ఆరో ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పరిశోధనల ప్రోత్సాహం దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.