News December 20, 2025

భద్రాద్రి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి నాటకం

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అటవీ శాఖాధికారిని శృతిలయ.. భర్త ధరావత్ హరినాథ్(39)ను ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. పాల్వంచ(M) వెంగళరావుపేటలో జరిగిన ఈ ఘటనలో, హరినాథ్‌ను గొంతు నులిమి చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో భార్య, ప్రియుడు కౌశిక్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 21, 2026

వరంగల్: 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై WGL పోలీసులు నిఘా పెంచారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 100 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పరిధిలో అత్యధికంగా 35 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్ 19, వెస్ట్ జోన్‌లో 31, ఈస్ట్ జోన్‌లో 15 కేసులు నమోదయ్యాయని, మద్యం తాగి వాహనం నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు.

News January 21, 2026

కొత్తగూడెం: తొలి రోజే పులి పాదముద్రలు లభ్యం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్-2026’ సర్వే ప్రారంభమైంది. పాల్వంచ రేంజ్ పరిధిలో స్వయంగా DFO కిష్టాగౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో తొలిరోజే పులి పాదముద్రలు కనిపించాయి. ప్రతిరోజూ 5 కి.మీ మేర అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు, అడుగు జాడలను పరిశీలించి ‘M-STriPES’ యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. నాలుగేళ్లకు ఒకసారి ఈ వన్యప్రాణుల గణన జరుగుతుంది.

News January 21, 2026

ఐనవోలు: వృద్ధురాలి అనుమానాస్పద మృతి

image

HNK జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో కత్తుల ఐలమ్మ (60) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఐలమ్మ మనుమడు కత్తుల బన్నీ, ఐలమ్మ కొడుకు కత్తుల కొమురయ్య ఇద్దరూ గొడవ పెట్టుకుని దాడులు చేసుకుంటుండగా మధ్యలో వెళ్లిన ఐలమ్మకు ఇటుక రాయి ఛాతీ భాగంలో తాకడంతో గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. యువకుడు మత్తులో ఉన్నట్లు సమాచారం.