News December 20, 2025
ASF కలెక్టరేట్‌లో మీ డబ్బు..మీ హక్కు కార్యక్రమం

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక కార్యక్రమం ‘మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 23న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.
Similar News
News January 17, 2026
నేడు బంగ్లాతో భారత్ ఢీ

U-19 వన్డే WCలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన 14ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. అతనికి తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జి, కుందు రాణిస్తే IND గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అటు తొలి మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన హెనిల్ పటేల్‌ను నిలువరించడం బంగ్లాకు కష్టమే. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మ్యాచ్ 1pmకు మొదలుకానుంది.
News January 17, 2026
NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.
News January 17, 2026
కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.


