News April 21, 2024
రేపు ‘సత్యభామ’ నుంచి అప్‌డేట్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ ‘సత్యభామ’. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రేపు సాయంత్రం 4.05 గంటలకు అప్‌డేట్ ఇవ్వనన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
Similar News
News February 21, 2026
ALERT: మూడ్రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 21, 2026
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.
News February 21, 2026
సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.


